Lingashtakam Lyrics in Telugu

Download Lingashtakam Lyrics in Telugu PDF using the direct download link.

Lingashtakam Lyrics in Telugu PDF

PDF NameLingashtakam Lyrics in Telugu
Published/Updated On
Category
RegionGlobal
No. of Pages7
PDF Size0.38 MB
LanguageTelugu
Source(s) / CreditsOliPDF

Download PDF of Lingashtakam Lyrics in Telugu from OliPDF using the direct download link given at the bottom of this article.

Lingashtakam Lyrics in Telugu PDF - Overview

Lingashtakam Lyrics In Telugu:

Lingashtakam is chanted while worshiping lord Shiva. Lingashtakam is also popular as Brahma Murari Surarchita Lingam Stotram. By this Lingashtakam we worship Lord Shiva in his Linga form.

Get Lingashtakam Lyrics in Telugu With Meaning PDF here and chant it with devotion to get the grace of Lord Shiva.

Lingashtakam Lyrics In Telugu

బ్రహ్మమురారిసురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగమ్|
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౧||

అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్|
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౨||

అర్థం – ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగమ్ |
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౩||

అర్థం – ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగమ్|
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౪||

అర్థం – ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్|
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౫||

అర్థం – ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్|
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౬||

అర్థం – ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్|
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౭||

అర్థం – ఏ లింగము ఎనిమిది (బిల్వ) దళములను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్|
పరాత్పరం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ||౮||

అర్థం – ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

అర్థం – లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.

Also Download
Lingashtakam Lyrics in English and Lingashtakam Lyrics

Download Lingashtakam Lyrics in Telugu PDF from OliPDF using the direct download link given below.

Lingashtakam Lyrics in Telugu PDF Download Link

Download PDF

RELATED PDF FILES

LATEST UPLOADED PDF FILES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *